Welcome to Rishi Pharma

Rishi Ayurved

Home

About

Products

Patient Info

Ayurved Books

TELUGU  తెలుగు

 

 

 

 

ఋషివాక్యం

ఏకైకా గౌ, స్త్రయ స్సింహాః,
పంచవ్యాఘ్రాః ప్రసూతిభిః
అధర్మో నష్టసంతానో
ధర్మః సంతానవర్ధనః

గోవు సాధువు. ఎవరి జోలికి పోదు. అంతేకాదు, అందరి ప్రాణాలు నిల్పుతుంది. అట్టి ఆవు ఈనేది ఒక్క దూడనే. క్రూరజంతువులైన సింహాలు మూడేసి పిల్లలనూ, బెబ్బులులు ఐదేసి పిల్లలనూ పెడుతున్నా క్రూరజంతుజాతి నశిస్తున్నది, గోజాతి వృద్ధిపొందుతున్నది. ఎందుకంటే ధర్మం తీరే అంత! ధర్మపరుల సంతానం వృద్ధిలోకి వస్తుంది, అధర్మపరుల సంతతి నశిస్తుంది.

ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలంటే జీవితం గురించిన అవగాహన ఏర్పరచుకోవాలి.

 

         కోరికలు గుర్రాలన్నారు పెద్దలు. అవి ఎల్లప్పుడూ దౌడుకే సిద్ధంగా ఉంటాయి. కోరికలంటూ పుట్టాలే కాని పుట్టేక, వాటి వెనుక మనం పరుగెత్తి సాధించేలా చేసుకుంటాయి అవి. కనుక వాటిపై మనం స్వారీ చేసేకన్నా మనపై అవి స్వారీ చేసే సందర్భాలే ఎక్కువ. ఆ కోరికలు తీరకపోతే తీరని నిరాశ మిగులుస్తాయి.

అలాగే విముఖత, వెగటూ ఉన్నాయి. కోరికల్లాగే యివీ చాలాశక్తి వంతమైనవే. వాటినుంచి మనం దూరంగా ఉండేలా శాసిస్తాయవి. మనం అసహ్యించు కునేవి, వెగటుగా భావించేవి వద్దనుకున్నా మనకు లభిస్తే తీవ్రమైన వ్యాకులత మిగుల్తుంది.

అలా మనల్ని 'కోరికలు' ఒక చివరకి, విముఖత మరో చివరకీ లాగేసి ప్రశాంతతకి భంగం కలిగిస్తాయి.

మరి మనం వీటినుంచి బయట పడేదెలా? తీరే అవకాశం లేని కోరికల్ని నియంత్రించుకోవడానికి, తప్పించుకో వీల్లేని విముఖత తీవ్రతను తగ్గించడానికీ కృషి చెయ్యండి. మీ చుట్టూరా మీరు కోరుకోగల, తీర్చుకోగల అంశాలు మరెన్నో ఉంటాయి. వాటిమీదకి దృష్టి మళ్ళించండి. తద్వారా యిటు తీవ్ర నిరాశకాని, అటు తీవ్ర మనస్తాపం కాని కలగకుండా కాపాడుకోగల్గుతాము. ప్రశాంతతను సాధించుకో గల్గుతాము.

రోగం, మరణం, ఆకస్మిక సంఘటనలు, వైపరీత్యాలు లాంటి మానవాధీనంలో లేని పరిస్థితుల్నుంచి తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేయడం వ్యర్థం. అలాంటి ప్రయత్నం పరిధికి మించి చేసేవాళ్ళు తమకీ, యితరులకీ కూడా సమస్యల్ని, అశాంతిని కొనితెస్తారు.

అత్యాశ, వైముఖ్యాలూ ఎంత సహజమైనవైనా అవి కూడా ''అలవాట్లే''నని మరిచిపోకూడదు. చెడ్డ అలవాట్లను వదిలించుకోవడం, మంచివి పెంపొందించు కోవడం మన చేతిలో ఉంది.

నిష్కాముకులుగా మిగిలిపోమని చెప్పడం లేదు సుమా, అసాధ్యమైన కోరికలకీ, ప్రయత్నం మీద సాధించగల కోరికలకీ, సులభసాధ్యమైన కోరికలకీ మధ్య తేడాని గుర్తించండి. మొదటిది విడిచిపెట్టండి. 2వది, 3వది సాధించుకోండి. ఆ క్రమంలో హూందాతనాన్ని, పట్టు విడుపుల్ని మరువకండి.

కొన్ని సామాన్య అనారోగ్యాలకు ఇంట్లోనే తయారు చేసికోగల మందుల్ని, తయారీ విధానాన్ని ఈ దిగువ యిస్తున్నాం. మీ ఇంటిల్లపాదినీ ఆరోగ్యంగా ఉంచుకోండి!

   

 


Problem conceiving?

Married but never had intercourse?

What position and frequency of intercourse is optimal for conception?

Does women on top position diminish pregnancy chances?

I am on pills to regularize my periods. Pills delay pregnancy. But I want to conceive. How can I ensure both?

Consult care@rishiayurved.in for  many such questions.

Register here for free.
 

 

REGISTER! 

 

Customer care
Billing policy
Refund and Return Policy
About Us


Product Categories:

Joint Care
Male Fertility supplements
Female Fertility supplements
Sexual Wellness supplements
Digestion supplements
 

 

Subscribe to our Newsletter

* required
 

Rights Reserved. Rishi Pharma, Samalkot, India. 2014.

 

Google+